తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టు వీడని విపక్షాలు- ఉభయసభలు సోమవారానికి వాయిదా

parilament monsoon session live updates
పార్లమెంటు సమావేశాలు లైవ్​

By

Published : Jul 30, 2021, 11:14 AM IST

Updated : Jul 30, 2021, 2:46 PM IST

14:42 July 30

రాజ్యసభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. పెగసస్​, సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని డిమాండ్​ చేస్తూ వెల్​కి వచ్చి నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొబ్బరి అభివృద్ధి సవరణ బిల్లు-2021ను భాజపా నేత నరేంద్ర సింగ్​ తోమర్​ ప్రవేశపెట్టగా.. ఓటింగ్​ నిర్వహించారు. ఓ వైపు విపక్షాలు ఆందోళన చేస్తున్న క్రమంలోనే బిల్లుకు ఆమోదం తెలిపింది రాజ్యసభ.  

విపక్షాలు ఆందోళన విరమించకపోవటం వల్ల సభను సోమవారానికి వాయిదా వేశారు ఉపసభాపతి హరివంశ్​ నారాయణ్​

12:23 July 30

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్​సభలో విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పెగాసస్​పై చర్చకు పట్టుబట్టారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్​. పెగసస్​, సాగు చట్టాలుపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టడం వల్ల ఈ వారం సభ సజావుగా సాగలేదు.

12:12 July 30

పెగసస్​గపై చర్చకు డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విపక్షాలు అందోళనలు కొనసాగించడం వల్ల శఘభ మరోమారు మధ్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా పడింది. 

11:38 July 30

పార్లమెంటు సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. పెగసస్​ వ్యవహారంపై చర్చ జరపాలని లోక్​సభలో విపాక్షాలు ఆందోళనలు చేపట్టడం వల్ల సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశం కానుంది.

11:11 July 30

పార్లమెంటు సమావేశాలు లైవ్​

పెగసస్ వ్యవహారంపై విపక్షాలు పార్లమెంటులో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. దీంతో రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం వల్ల సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్​ వెంకయ్యనాయుడు.

Last Updated : Jul 30, 2021, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details