కరోనా టీకాల ఉత్పత్తిని పెంచాలని కేంద్రానికి మార్చి 8నే నివేదిక ఇచ్చినట్లు కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ తెలిపారు. తన నేతృత్వంలోని 31మంది సభ్యులతో కూడిన శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని వయసుల వారికి వాక్సిన్ పంపిణీ చేస్తే టీకా కొరత వస్తుందని ఊహించే.. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని చెప్పినట్లు స్పష్టం చేశారు.
'టీకాల ఉత్పత్తి పెంచాలని మార్చిలోనే చెప్పాం' - పార్లమెంటరీ స్థాయి సంఘం
కరోనా టీకాల ఉత్పత్తిని పెంచాలని మార్చిలోనే ప్రభుత్వాకి సూచించినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. నివేదిక ఆధారంగా టీకా తయారీ కేంద్రాలకు నిధులు సమకూర్చినట్లు కమిటీ సభ్యుడు, భాజపా ఎంపీ అనురాగ్ శర్మ తెలిపారు.
జైరాం రమేశ్
అయితే కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని సీరం, భారత్ బయోటెక్‌కు నిధులు సమకూర్చినట్లు ప్యానెల్ సభ్యుడు, భాజపా ఎంపీ అనురాగ్ శర్మ తెలిపారు.
ఇదీ చదవండి:ఉచిత టీకా కోసం మోదీకి విపక్ష నేతల లేఖ