పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం.. ల్యాండింగ్ సమస్య వల్ల భారత్ గగనతలంలోకి ప్రవేశించి పది నిమిషాలు పాటు చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో పైలట్.. విమానాన్ని 23 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఓ మీడియా ప్రచురించడం వల్ల వెలుగులోకి వచ్చింది.
మీడియా కథనం ప్రకారం..
మే 4వ తేదీ పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం(పీకే 248).. మస్కట్ నుంచి లాహోర్‌కు బయలుదేరింది. అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు లాహోర్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ సమయంలో లాహోర్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పైలట్.. విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలు మేరకు పైలట్.. గో- అరౌండ్ విధానాన్ని ప్రారంభించాడు. లాహోర్ పరిసరాల్లో చక్కర్లు కొట్టాడు. వర్షం భారీగా కురుస్తుండడం, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉండడం వల్ల దారి తప్పి భారత్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాన్ని 23వేల అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లాడు. పంజాబ్‌లోని తరణ్ సాహిబ్, రసూల్‌పుర్ నగరం గుండా వివిధ ప్రాంతాల్లో ప్రయాణించిన ఆ విమానం కాసేపటికి తిరిగి పాకిస్థాన్‌లోని ముల్తాన్‌కు చేరుకుంది. మొత్తం భారత్ గగనతలంలో దాదాపు పది నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన పాక్ విమానం.. 120 కిలోమీటర్లు మేర ప్రయాణించింది.
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఇంజిన్‌లో మంటలు!
ఇటీవలేఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో సమస్యను గుర్తించిన పైలట్లు.. కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీ విమానాశ్రయం ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్)కి సమాచారం ఇచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్టు సమీపంలోకి వచ్చిన విమానం.. మంటలతో కొద్ది సేపు గాల్లో చక్కర్లు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం చక్కర్లు కొట్టిన వీడియో చూడాలనుకుంటున్నారా?.. అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
పాక్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొద్ది నెలల క్రితందిల్లీ నుంచి దోహాకు బయల్దేరిన విమానాన్ని పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఓ ప్రయాణికుడికి అస్వస్థత తలెత్తడం వల్ల విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు. అయితే ఆ ప్రయాణికుడు మృతి చెందినట్లు కరాచీ విమానాశ్రయ వైద్య బృందం అధికారికంగా ప్రకటించింది. అసలేం జరుగుతుందో తెలుసుకుంటారా?.. ఈ పూర్తి వార్త కోసంఇక్కడ క్లిక్ చేయండి.