Narcotic smugglers: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల గుండా భారత్‌లోకి ప్రవేశిస్తున్న ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 ప్యాకెట్ల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
"కశ్మీర్‌లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా భారత్‌లోకి చొరబడుతున్న ముగ్గురిని ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ గుర్తించింది. వారిని లొంగిపోవాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో వారిని బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 ప్యాకెట్లలో(ఒక్కోటి కిలో) మత్తు మందును స్వాధీనం చేసుకున్నాయి. "