Optical Illusion Test for Your Eyes : ఆప్టికల్ ఇల్యూషన్‌కు సంబంధించిన ఫొటోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలను ప్రతి ఒక్కరూ ఛాలెజింగ్‌గా తీసుకుంటున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ ఛాలెజింగ్‌లో పోటీ పడుతున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించి మెదడును కాసేపు గజిబిజి చేస్తాయి. ఇలాంటివి కంటికి పరీక్ష మాత్రమే కాదు.. మెదడుకు మేతలా కూడా పని చేస్తాయి. ఈ టెస్టులో మెదడు, కళ్లను సరిగ్గా ఉపయోగిస్తేనే.. ఫొటో వెనుక ఉన్న అసలు వాక్యాన్ని పట్టుకోవచ్చు.
కళ్ల చుట్టూ 'డార్క్ సర్కిల్స్' వేధిస్తున్నాయా? ఇలా చేసి చూడండి!
మీ కళ్లకు పరీక్ష.. కింద పేర్కొన్న చిత్రంలో దాగి ఉన్న వాక్యాన్ని 10 సెకన్లలో కనుగొనండి..
Find Hidden Sentence in the picture in 10 Seconds :
కింద నలుపు, తెలుపు గీతలతో అస్పష్టంగా కనిపిస్తున్న చిత్రంలో ఒక వాక్యం దాగి ఉంది. 10 సెకన్లలో ఆ వాక్యాన్ని కనుగొనడాన్ని మీరు సవాలుగా తీసుకోవాలి.
- మీరు ఆ వాక్యాన్ని కనిపెట్టగలరా?
- మీ సమయం ప్రారంభమయింది.
- మీరు చిత్రాన్ని జాగ్రత్తగా గమనించి, దాగి ఉన్న వాక్యాన్ని 10 సెకన్లలో గుర్తించాలి.
- దాగి ఉన్న వాక్యాన్ని గుర్తించారా?
- త్వరగా.. సమయం అయిపోతుంది.
- చిత్రాన్ని మరొకసారి చూడండి.. మీరు దాగి ఉన్న వాక్యాన్ని గుర్తించడానికి చాలా దగ్గరగా ఉండవచ్చు.
- సమయం ముగిసింది. వెతకడం ఆపండి..!
- మీ పదునైన దృష్టితో కొందరు ఆ వాక్యాన్ని గుర్తించి ఉండవచ్చు. వారికి అభినందనలు..! మీరు 20/20 visionతో కచ్చితమైన దృష్టి శక్తిని కలిగి ఉన్నారు.
పైన ఫొటోలో దాగిఉన్న వాక్యాన్ని ఇప్పటికీ మీరు గుర్తుపట్టకపోతే.. ఏమాత్రం చింతించకండి. మీతో పాటుగా చాలా మంది ఆ వాక్యాన్ని కనిపెట్టకపోయి ఉండవచ్చు. అయితే ఇంతకీ అందులో దాగి ఉన్న వాక్యం ఏమిటయి ఉంటుందబ్బా అని ఆలోచిస్తున్నారా? ఎక్కువగా ఆలోచించి మైండ్ కరాబు చేసుకోకండి. ఆ చిత్రంలో దాగి ఉన్న వాక్యం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. అందులో దాగి ఉన్న వాక్యం.. 'ARE YOU HIGH?'. ఇప్పుడు చెప్పండి ఎంత మంది కరెక్ట్‌గా గుర్తించారు..?!
World Sight Day : ఈ 8 టిప్స్‌తో మీ కళ్లు సేఫ్!
ఇవి తింటే మెరుగైన కంటిచూపు మీదే! విటమిన్ ఏ లభించే పదార్థాలివే