Omicron Immune Escape: ఒమిక్రాన్‌కు రోగ నిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం అధికంగా ఉన్నట్లు కరోనా జన్యు క్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం (ఇన్సాకాగ్) తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రయోగాత్మక, క్లినికల్ డేటా ఉన్నట్లు వెల్లడించింది. టీకా సామర్థ్యాన్ని సైతం ఒమిక్రాన్ గణనీయంగా తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని గ్లోబల్ డేటాను ఉటంకిస్తూ తెలిపింది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొంది.
అయితే డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వల్ల వ్యాధి తీవ్రత, లక్షణాలు తక్కువగా ఉన్నట్లు ఇన్సాకాగ్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ డెల్టా ఆందోళనకర వేరియంట్‌గా కొనసాగుతోందని పేర్కొంది.