తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Nipah Virus: కేరళలో 'నిఫా' అలర్ట్- వారందరికీ నెగెటివ్

కరోనాతో విలవిల్లాడుతున్న కేరళలో నిఫా వైరస్ (nipah virus kerala) కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఓ బాలుడు మరణించిన నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలు జిల్లాల్లో హైఅలర్ట్ విధించారు. అయితే, బాలుడికి సన్నిహితంగా మెలిగిన 8 మందికి పరీక్షల్లో నెగెటివ్​గా తేలడం మాత్రం ఊరట కలిగిస్తోంది.

nipah kerala
నిఫా వైరస్

By

Published : Sep 7, 2021, 11:16 AM IST

నిఫాతో మరణించిన (nipah death in kerala) కేరళ కోజికోడ్​కు చెందిన బాలుడి క్లోజ్ కాంటాక్ట్​లకు (సన్నిహితంగా మెలిగిన వారికి) పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. మొత్తం ఎనిమిది మందికి నిఫా వైరస్(nipah virus) లేదని తేలినట్లు కేరళ వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ (veena george) తెలిపారు. ఇది ఊరట కలిగించే విషయమని అన్నారు. మరిన్ని నమూనాలను పరీక్షిస్తామని చెప్పారు.

బాలుడితో మొత్తం 251 మంది సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించామని కేరళ వైద్య శాఖ తెలిపింది. అందులో 129 మంది హెల్త్ వర్కర్లు ఉన్నారని చెప్పింది. అధిక రిస్కు ఉన్న 54 మందిని (30 మంది హెల్త్ వర్కర్లు) ఐసోలేషన్ వార్డులలో (nipah virus treatment) ఉంచినట్లు వెల్లడించింది. లక్షణాలు కనిపించిన వారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

హైఅలర్ట్

ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కరోనాతో (covid in kerala) విలవిల్లాడుతున్న కేరళలో.. నిఫా కేసులు (nipah virus transmission) పెరగకుండా జాగ్రత్తపడుతోంది. కోజికోడ్, కన్నూర్, మలప్పురం, వయనాడ్ జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని గుర్తించి వెంటనే నియంత్రించే విధంగా స్థానిక అధికారులు పనిచేస్తున్నారు.

అటు, సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోనూ హైఅలర్ట్ విధించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కేవీ రాజేంద్ర.. ప్రజలను కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఏంటీ నిఫా?

అసలు నిఫా వైరస్ ఏంటి? ఎలా సోకుతుంది? వ్యాధి నివారణకు టీకా ఉందా? నివారణ ఎలా అన్న విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:

'కాంటాక్ట్ ట్రేసింగ్'తో నిఫా పనిబట్టే యత్నాల్లో కేరళ

ABOUT THE AUTHOR

...view details