Newborn baby killed by mother: పెళ్లి కాకుండానే తల్లి అయిన ఓ యువతి.. తన బిడ్డను హత్య చేసి ప్రియుడి సాయంతో మురికి కాలువలో పడేసింది. ఈ అమానవీయ సంఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డను హత్య చేసిన 22 ఏళ్ల యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ జరిగింది..
పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. త్రిస్సూర్‌లోని పుఝక్కల్ బ్లాక్‌కు చెందిన యువతి.. ప్రేమ పేరుతో ఓ వ్యక్తితో సన్నిహితంగా గడిపి, గర్భం దాల్చింది. ఆ విషయాన్ని దాచి పెట్టింది. కొందరు బంధువుల సాయంతో ఈనెల 18న శనివారం రాత్రి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ వెంటనే శిశువును హత్య చేసింది. శిశువు మృతదేహాన్ని మాయం చేయాలని తెల్లవారుజామున.. తన ప్రియుడికి ఇచ్చింది. అతను.. తన స్నేహితుడితో కలిసి చిన్నారి మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి పూన్కున్నమ్ ఎమ్మెల్యే రోడ్‌లోని పరమెక్కవు శాంతి ఘాట్ సమీపంలో మురికి కాలువలో పడేశాడు.
మురికి కాలువలో కుల్లిపోయిన శిశువు మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికంగా ఉండే సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే చిన్నారిని బ్యాగ్‌లో పెట్టి పడేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు.