తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NEET MDS 2022 Postponed: 'నీట్‌ ఎండీఎస్‌ పరీక్ష 4-6 వారాలు వాయిదా'

NEET MDS 2022 Postponed: నీట్‌ ఎండీఎస్‌-2022 పరీక్షను 4-6 వారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. 2022 మార్చి 31తో పూర్తి కావాల్సిన ఇంటర్న్‌షిప్‌ గడువును జులై 31 వరకూ పొడిగించింది.

NEET MDS 2022 Postponed
NEET MDS

By

Published : Feb 18, 2022, 5:09 AM IST

NEET MDS 2022 Postponed: దంత వైద్యానికి సంబంధించి పీజీ సీట్లలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ ఎండీఎస్‌-2022 పరీక్షను 4-6 వారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మార్చి 31, 2022 లోపు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన బీడీఎస్‌ విద్యార్థులకు నీట్‌ ఎండీఎస్‌ పరీక్ష రాయడానికి అర్హత లభిస్తుంది. కొవిడ్‌ నేపథ్యంలో దంత వైద్య విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయలేని పరిస్థితులు ఎదురయ్యాయి.

ఈ క్రమంలో ఆ గడువు తేదీని పొడిగించడమే కాకుండా.. ఈ విద్యార్థులు నీట్‌ ఎండీఎస్‌ పరీక్ష రాయడానికి వీలుగా ఆ తేదీని కూడా మార్చాలని కొన్ని దంత వైద్య కళాశాలలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. దీంతో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకొంది.

మార్చి 31 2022తో పూర్తి కావాల్సిన ఇంటర్న్‌షిప్‌ గడువును అదే సంవత్సరం జులై 31 వరకూ పొడిగించింది. ఈ గడువు నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన విద్యార్థులు నీట్‌ ఎండీఎస్‌ రాయడానికి అర్హత పొందుతారని పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే నీట్‌ పీజీ దంత వైద్య ప్రవేశ పరీక్ష ఎప్పుడనేది మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

ఇదీ చూడండి:NEET PG Exam: మే 21న నీట్​ పీజీ ఎంట్రన్స్​

ABOUT THE AUTHOR

...view details