తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా అభివృద్ధి అజెండాకు విపక్షాల అడ్డు' - భాజపా

కీలకమైన భాజపా జాతీయస్థాయి అఫీస్​ బేరర్ల సమావేశం దిల్లీలో జరిగింది. భేటీలో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. విపక్షాలపై మండిపడ్డారు. భాజపా అభివృద్ధి అజెండాకు విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.

Nadda
'భాజపా అభివృద్ధి అజెండాకు విపక్షాల అడ్డు'

By

Published : Oct 18, 2021, 2:12 PM IST

ఎన్​డీఏ ప్రభుత్వ అజెండా అయిన అభివృద్ధికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కమలదళం కార్యకర్తలు రాజకీయంగానే కాకుండా, సామాజికంగానూ దేశం కోసం కృషిచేశారన్నారు.

దిల్లీలో జరిగిన భాజపా జాతీయస్థాయి ఆఫీస్​ బేరర్ల సమావేశంలో పాల్గొన్నారు నడ్డా. కరోనా కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. రాజకీయాల నిర్వచనాన్ని మార్చే విధంగా అధికార పక్షం సేవలందించిందని కొనియాడారు.

సమావేశంలో నడ్డా
సమావేశానికి హాజరైన సభ్యులు

రానున్న నెలలకు సంబంధించిన పార్టీ అజెండాపై సమావేశంలో చర్చించినట్టు భాజపా ఉపాధ్యక్షుడు, ఛత్తీస్​గఢ్​ మాజీ సీఎం రమణ్​ సింగ్​ వెల్లడించారు. ఈ విషయంపై ప్రధాని మోదీ సంస్థాగత స్థాయి నేతలతో కొంత కాలంగా చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ తరఫున పనిచేస్తూనే, సమాజానికి ఉపయోగపడవచ్చనే విషయాన్ని భాజపా కార్యకర్తలు చేసి చూపించారని ప్రశంసించారు.

ఇదీ చూడండి:-అడ్వాణీ, జోషికి భాజపాలో మరోమారు కీలక బాధ్యతలు!

ABOUT THE AUTHOR

...view details