తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలులో మంటలు- బూడిదైన రెండు ఏసీ బోగీలు!

రైలులో మంటలు చెలరేగి రెండు ఏసీ బోగీలు కాలి(fire accident in train) బూడిదయ్యాయి. మధ్యప్రదేశ్​ మొరేనా ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం(train burning news today) జరిగింది.

fire in Train
రైలులో మంటలు

By

Published : Nov 26, 2021, 5:20 PM IST

Updated : Nov 26, 2021, 6:23 PM IST

రైలులో మంటలు చెలరేగిన రెండు బోగీలు దగ్ధం

మధ్యప్రదేశ్​, మొరేనా ప్రాంతంలో రైలు ప్రమాదం(fire accident in train) జరిగింది. మొరేనా, ధోల్​పుర్​కు మధ్యలో ఉండే.. హేతమ్​పుర్​ రైల్వే స్టేషన్​ నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే ఉధమ్​పుర్​ ఎక్స్​ప్రెస్​లోని ఏ1, ఏ2 బోగీల్లో మంటలు(train burning news today) అంటుకున్నాయి.

నాలుగు బోగీల్లో మంటలు(fire in train latest news) అలుముకున్నాయని స్థానికులు చెప్పారు. అయితే, రెండు బోగీల్లోనే మంటలు చెలరేగినట్లు సరాయ్​చోలా పోలీస్​ స్టేషన్​ ఇంఛార్జ్​ రిషికేశ్​ శర్మ తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని, ప్రయాణికులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని చెప్పారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

ఇదీ చూడండి:అతడి కోసం పోలీస్ ​స్టేషన్​ను పేల్చేసిన నక్సల్స్

Last Updated : Nov 26, 2021, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details