తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు ఇంట్లో రూ.1.24కోట్లు చోరీ

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ రైతు ఇంట్లో భారీ చోరీ జరిగింది. నాలుగెకరాల భూమిని అమ్మగా వచ్చిన రూ.1.24 కోట్లను దుండగులు అపహరించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rs 1.24 crore stolen from farmer's house
కేరళలో రైతు ఇంట్లో రూ.1.24 కోట్లు చోరీ

By

Published : Apr 8, 2021, 3:30 PM IST

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ రైతు ఇంట్లో భారీ చోరీ జరిగింది. భూమి అమ్మగా వచ్చిన రూ.1.24కోట్లను దుండగులు ఎత్తుకెళ్లారు.

శివపురి​ జిల్లా కరేరా మున్సిపాలిటీకి చెందిన జహర్​ సింగ్​ అనే రైతు నాలుగెకరాల భూమిని తనకు పరిచయస్తులైన ఇద్దరికి పదిరోజుల క్రితం అమ్మాడు. చెల్లింపులు నగదు రూపంలోనే జరిగాయి. కొనుగోలుదారులు ఇచ్చిన రూ.1.24 కోట్లను ఇంట్లోని పెట్టెలో దాచి, ఆ గదికి తాళం వేశాడు జహర్​ సింగ్​. రాత్రి ఆయన బయట పడుకోగా.. ఇంట్లో ఉన్న డబ్బు మాయమైంది.

అంత మొత్తంలో డబ్బును ఇంట్లోనే పెట్టుకోవటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఎస్పీ రాజేష్​ సింగ్​ తెలిపారు.

ఇదీ చదవండి:రెండేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details