తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం అలర్ట్​- తెలంగాణ సర్కారుకు లేఖ

central write letter to states: దేశంలో కోవిడ్​ కేసుల పెరుగుదలపై పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది కేంద్రం. వారం రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు మహారాష్ట్రలో సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం రోజు 1,134కొత్త కేసులు నమోదయ్యాయి.

central write letter to states
central write letter to states

By

Published : Jun 3, 2022, 6:11 PM IST

Updated : Jun 3, 2022, 10:49 PM IST

central write letter to states: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 21వేలు దాటింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానికంగా కొవిడ్‌ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. దీంతో కొవిడ్‌ కట్టడికి ముమ్మర చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ ఐదు రాష్ట్రాలకు లేఖ రాసింది.

'కరోనా వైరస్‌పై చేస్తోన్న పోరులో ఇప్పటివరకూ వచ్చిన ఫలితాలను కోల్పోకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ప్రజారోగ్యం విషయంలో ముప్పు అంచనా ఆధారిత విధానాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో టెస్టుల సంఖ్య పెంచడం, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టడాన్ని ముమ్మరంగా చేయాలి. వైరస్‌ వ్యాప్తి తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమర్థంగా కట్టడి చర్యలు చేపట్టాలి' అని ఐదు రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ఈ సమష్టి కృషిలో అవసరమైన మద్దతును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తనవంతు సహాయాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, గత వారంరోజులుగా దేశంలో పలు చోట్ల కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 4041 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దాదాపు మూడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా పాజిటివిటీ రేటు కూడా ఒక శాతానికి చేరువయ్యింది. కేవలం మహారాష్ట్ర, కేరళలోనే వెయ్యి చొప్పున కేసులు వెలుగు చూశాయి. ముంబయిలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారు. లేదంటే మళ్లీ ఆంక్షలు విధించాల్సి రావచ్చని పరోక్ష హెచ్చరిక చేశారు.

Maharashtra covid cases: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. గురువారం 1,045 కేసులు నమోదు కాగా.. శుక్రవారం కేసుల సంఖ్య 1,134కు చేరుకుంది. కరోనా బారిన పడి ముగ్గురు మరణించారు. ఫిబ్రవరి 24 తర్వాత ఈరోజే అత్యధిక కేసుల నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 5,127కు పెరిగింది. దీంతో మొత్తం కేసులు 78,90,346 నమోదు కాగా.. మరణాల సంఖ్య 1,47,864కు చేరింది. మరోవైపు రాష్ట్ర రాజధానిలో కేసుల సంఖ్య తగ్గడం లేదు. గురువారం 704 కొత్త కేసులు నమోదుకాగా.. శుక్రవారం 763 కొత్త కేసులు వెలుగుచూశాయి. రికవరి రేటు 98.06గా ఉంది.

delhi corona cases: దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం 345 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కేసుల సంఖ్య 19,07,982కు పెరిగింది. మరణాల సంఖ్య 26,212గా ఉంది. పాజిటీవిటి రేటు 1.88 శాతంగా ఉంది.

India Corona cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు మరో 4,041 మంది వైరస్​ బారినపడ్డారు. దాదాపు 84 రోజుల తర్వాత.. కేసులు 4 వేల మార్కును దాటాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.95 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.73గా ఉంది. ఒక్కరోజే 10 మంది చనిపోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గురువారం 2363 మందికిపైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. గురువారం కూడా మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజే మరో 1045 మంది కొవిడ్​ బారినపడ్డారు. ముంబయి, పుణె, ఠాణెలోని పలు ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో యాక్టివ్​ కేసులు 4559కు పెరిగాయి. ఇందులో సగానికిపైగా ముంబయి నుంచే ఉన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.

  • దేశంలో మొత్తం కరోనా కేసులు: 4,31,68,585
  • మొత్తం మరణాలు: 5,24,651
  • యాక్టివ్​ కేసులు: 21,177
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,22,757

Vaccination India: దేశవ్యాప్తంగా గురువారం 12,05,840 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,93,83,72,365కు చేరింది. ఒక్కరోజే 4,25,379 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ఇదీ చదవండి:దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటా: మోదీ

Last Updated : Jun 3, 2022, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details