అంగారకుడిపై నాసా విజయవంతంగా 'పర్సెవరెన్స్' రోవర్‌ను ప్రవేశపెట్టింది. మార్స్‌పై జీవజాలం జాడను కనుగొనుదొనేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే అరుణ గ్రహానికి భారత్ చేపట్టబోయే తదుపరి ప్రయోగం మంగళ్యాన్-2 కూడా 'ఆర్బిటర్ మిషన్' అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ తెలిపారు.
రోవర్.. అంగారకుడిపై దిగి అక్కడి నమూనాలను భూమిపైకి పంపిస్తుంది. ఆర్బిటర్.. మార్స్ కక్ష్యలో తిరగుతూ సమాచారం అందిస్తుంది. అయితే.. ఈ మంగళ్యాన్-2 ప్రయోగం ఎప్పుడు చేపడతారో శివన్ స్పష్టతనివ్వలేదు. చంద్రయాన్-3 తర్వాతే దానిని ప్రయోగిస్తామని చెప్పారు. మార్స్‌పై ల్యాండింగ్ చాలా కష్టం అని శివన్ నొక్కి చెప్పారు.