బంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణం చేశారు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో రాజ్భవన్లో ఉదయం 10.45 గంటలకు నిరాడంబరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గవర్నర్ జగదీప్ ధన్కడ్ మమతతో ప్రమాణ స్వీకారం చేయించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రమాణస్వీకారం చేస్తున్న మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మమత బెనర్జీకి ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.
మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ సహా కొందరు నేతలకే ఆహ్వానాలు పంపించారు. మమత మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వంటి కొద్దిమంది సమక్షంలో ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు.
బంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుకు గానూ 292 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో తృణమూల్ కాంగ్రెస్ 213సీట్లు, భాజపా 77 సీట్లు, ఇతరులు 2సీట్లు గెలుచుకున్నారు. అయితే, మమతా బెనర్జీ తన స్థానంలో ఓటమిని చవిచూశారు.
ఇదీ చదవండి:'ఓడిపోయినప్పటికీ సీఎం పదవి ఎలా చేపడతారు'