తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తరగతిగదిలోనే విద్యార్థినిపై హెడ్​మాస్టర్​ లైంగిక వేధింపులు!

పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన ప్రధానోపాధ్యాయుడే.. ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దేవాలయంగా భావించే తరగతి గదిలోనే ఐదోతరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

headmaster for molesting class 5 student
ఐదోతరగతి విద్యార్థినిపై హెడ్​మాస్టర్​ అఘాయిత్యం

By

Published : Oct 6, 2021, 10:23 AM IST

ఎందరికో విజ్ఞానాన్ని అందించే పాఠశాలలను దేవాలయంగా భావిస్తారు. అటువంటిది తరగతిగదిలోనే ఓ ఐదోతరగతి విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. మహారాష్ట్ర చంద్రాపుర్​ జిల్లాలో ఓ గ్రామంలో జరిగిందీ ఘటన.

స్కూల్​కి వెళ్లిన తొలిరోజే..

కరోనా కారణంగా ఇన్నాళ్లు జిల్లాలో మూసివేసిన బడులను సోమవారమే(అక్టోబరు 4) తిరిగి తెరిచారు. అదేరోజు పాఠశాలకు వెళ్లిన బాలికను ఒక్కదాన్నే తరగతి గదిలో ఉంచి.. మిగిలిన విద్యార్థులను బయటకు పంపించేసి.. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను కొంతమంది విద్యార్థులు చూసినట్లు సమాచారం.

అయితే పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లిన బాలిక.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో విషయం ఊరిలో అందరికీ తెలియడం వల్ల నిందితుడిని కొట్టేందుకు భారీ సంఖ్యలో జనం పాఠశాల వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం.. పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:వేలాడే వంతెన కూలి 30మంది విద్యార్థులకు గాయాలు!

ABOUT THE AUTHOR

...view details