తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేయసి తల్లి, చెల్లిని హత్యచేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!

ప్రేమకు అడ్డొస్తున్నారనే కారణంతో ప్రేయసి.. తల్లీ చెల్లిని హత్య చేశాడో కిరాతకుడు. అంతేకాకుండా మృతదేహాల్ని తన ఇంట్లోనే పూడ్చి పెట్టాడు. దారుణమైన ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని జాన్​పుర్​లో జరిగింది.

murdered-mother-and-daughter
తల్లీబిడ్డల హత్య

By

Published : Mar 26, 2021, 1:54 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని జాన్​పుర్​లో దారుణం జరిగింది. తన ప్రేమకు అడ్డొస్తున్నారనే కారణంతో ప్రేయసి తల్లీ చెల్లిని హత్యచేసి తన ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఇదీ జరిగింది..

కొత్వాల్​లోని కాట్​గ్రాలో ఉండే మహాశర్​ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అతని పెద్దకూతురు, అదే గ్రామంలో ఉండే పుల్లు అనే యువకుడు ప్రేమించకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఆమె తల్లి..పెద్దకూతుర్ని.. గాజీపుర్​లోని బంధువుల ఇంటికి పంపించింది. దాంతో కక్ష పెంచుకున్న పుల్లు.. ప్రేయసికి ఫోన్​ చేసి.. ఆమె తల్లిని, చెల్లిని చంపుతానని బెదిరించాడని మహాశర్​ తెలిపారు. అనుకున్నట్టుగానే పుల్లు.. ప్రేయసి తల్లిని చెల్లిని హత్యచేసి తన ఇంట్లోనే పూడ్చి పెట్టాడు.

మహాశర్​ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలిస్తుండగా పుల్లు పోలీసుల కంట పడ్డాడు. అయితే ఓ చిన్నారిని ఎత్తుకుని పారిపోతుండగా పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్టు చేశారు. ఆ చిన్నారిని వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.

కాగా నిందితున్ని లోతుగా ప్రశ్నించగా తల్లీ బిడ్డల్ని చంపింది తానేనని ఒప్పుకున్నాడు. ఆ మృతదేహాల్ని తన ఇంట్లోనే పూడ్చి పెట్టానని తెలిపాడు. దాంతో పోలీసులు అతని ఇంట్లో తవ్వకాలు జరుపగా తల్లీకూతుర్ల శవాలు బయటపడ్డాయి. మృతదేహాల్ని శవపరీక్ష కోసం పంపించారు.

ఇదీ చదవండి:కూతుర్ని చంపి.. తలతో ఠాణాకు!

ABOUT THE AUTHOR

...view details