తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2021, 9:55 PM IST

ETV Bharat / bharat

'తేజస్​ ముందు చైనా యుద్ధ విమానాలు డీలా'

తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఎయిర్​ చీఫ్ మార్షల్ ఆర్​.కె.ఎస్ భదౌరియా హర్షం వ్యక్తం చేశారు. చైనా-పాక్​ యుద్ధ విమానాల కన్నా ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయం దేశ పారిశ్రామిక రంగానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

tejas, china, pak
ఎయిర్​ చీఫ్ మార్షల్ ఆర్​.కె.ఎస్​.భదౌరియా

కొత్తగా 83 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుతో వైమానిక దళం సామర్ధ్యం మరింత మెరుగవుతుందని ఎయిర్​చీఫ్ మార్షల్ ఆర్​కేఎస్ భదౌరియా అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. ఇవి చైనా పాకిస్థాన్​లు వినియోగించే జేఎఫ్​-17 ​యుద్ధ విమానాలకంటే సమర్థమంతమైనవి అని వ్యాఖ్యానించారు.

ఈ ప్రాజెక్టులో ప్రైవేటు రంగానికి కూడా భాగస్వామ్యం ఉంటుందన్నారు. ఈ కొనుగోలు దేశ పారిశ్రామిక రంగానికి మేలు చేస్తుందని భదౌరియా అభిప్రాయపడ్డారు.

"తేజస్‌ యుద్ధ విమాన తయారీ కార్యక్రమం వెనక ఉన్న వారికి ఇది గొప్ప గుర్తింపు. మొత్తం మీద భారత వైమానిక దళానికి, దేశానికి గొప్ప ముందడుగు. 83 యుద్ధ విమానాల కొనుగోలు అనేది చాలా పెద్ద ఆర్డర్‌.

యుద్ధ విమానాల తయారీకి ఇది పెద్ద పునాది వంటిది. ప్రస్తుతం తేజస్‌ విమాన సేవలు 2 స్క్వాడ్రన్​లకే పరిమితంగా కాగా ఇప్పుడు ఆ సంఖ్య నాలుగుకి చేరుతుంది."

-ఎయిర్​ చీఫ్ మార్షల్ ఆర్​.కె.ఎస్​.భదౌరియా

ఇదీ చదవండి :83 తేజస్​ ఫైటర్​ జెట్ల తయారీకి భారత్​ సిద్ధం

ABOUT THE AUTHOR

...view details