తెలంగాణ

telangana

Lakhimpur kheri case: కేంద్ర మంత్రి తనయుడికి బెయిల్​ నిరాకరణ

లఖింపుర్​ హింసాత్మక ఘటన కేసులో (Lakhimpur kheri case) విచారణ వేగవంతం చేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​). ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా తనయుడు ఆశిష్​ మిశ్రాకు జిల్లా కోర్టు బెయిల్​​ నిరాకరించింది.

By

Published : Oct 13, 2021, 4:14 PM IST

Published : Oct 13, 2021, 4:14 PM IST

Updated : Oct 13, 2021, 7:53 PM IST

Lakhimpur kheri case
సిట్​ ముందుకు ఆశిష్​ మిశ్రా స్నేహితుడు

లఖింపుర్​ హింసాత్మక ఘటనలో(Lakhimpur kheri case) ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్​ మిశ్రాకు చుక్కెదురైంది. అతడికి జిల్లా కోర్టు బెయిల్​ నిరాకరించింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​). ఆశిష్​ మిశ్రా, లవ్​కుశ్​, ఆశిష్​ పాండేతో పాటు శేఖర్​ భారతీని ఇదివరకే అరెస్టు చేయగా.. బుధవారం మరో ఇద్దరిని ప్రశ్నించిన అనంతరం కస్టడీలోకి తీసుకుంది.

ఆశిష్​ మిశ్రా స్నేహితుడు అంకిత్​ దాస్​ను నేడు అరెస్టు చేసింది. మాజీ మంత్రి అఖిలేశ్​ దాస్​కు.. అంకిత్​ దాస్​ అల్లుడు. ఘటన జరిగిన రోజు రైతులపైకి దూసుకెళ్లిన ఎస్​యూవీ ఇతడిదేనని తెలుస్తోంది.

ఈ కేసులో ఒక్కొక్కరిని విచారిస్తున్న అధికారులు.. 13న తమ ఎదుట హాజరుకావాలని దాస్​కు సమన్లు పంపింది సిట్​. ఉదయం 11 గంటలకు తన లాయర్లతో కలిసి దాస్​.. లఖింపుర్​లోని క్రైం బ్రాంచ్​ కార్యాలయానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి లతీఫ్​ను కూడా విచారించిన అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిని కలిసిన యూపీ మంత్రి..

అక్టోబర్​ 3న జరిగిన ఘటనలో(Lakhimpur kheri case).. ప్రాణాలు కోల్పోయిన భాజపా కార్యకర్త, కారు డ్రైవర్​ కుటుంబాలను పరామర్శించారు ఉత్తర్​ప్రదేశ్​ న్యాయశాఖ మంత్రి బ్రిజేష్​ పాఠక్​. ఎలాంటి భద్రత లేకుండానే ఆయన వెళ్లడం గమనార్హం. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించి.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇదీ జరిగింది..

యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్​ ఖేరిలో అక్టోబర్​ 3న (Lakhimpur Kheri news today) హింస చెలరేగింది. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులకు, అధికార వర్గాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: 'కేంద్ర మంత్రిని తొలగిస్తేనే.. బాధితులకు న్యాయం'

మూడు రోజుల పోలీస్​ కస్టడీకి కేంద్ర మంత్రి కుమారుడు

Last Updated : Oct 13, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details