తమిళనాడులోని కృష్ణగిరి- బెంగళూరు హైవేను యువకులు నిర్బంధించారు. ఎద్దుల పందేనికి జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వాలని రోడ్డుపై బైటాయించారు. దీంతో హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు మూడు గంటల పాటు వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. కృష్ణగిరి జిల్లా గోబసందిరం గ్రామం సమీపంలో ఈ ఆందోళనలు జరిగాయి.
వివరాల్లోకి వెళితే..గురువారం గోబసందిరం గ్రామం సమీపంలో ఎద్దుల పందేలు జరగనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వందల మంది యువకులు.. తమ ఎద్దులతో ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. పోటీలను చూద్దామని మరి కొంత మంది వచ్చారు. పోటీల గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. పందేన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువత.. రోడ్డుపై బైటాయించారు. ఎద్దుల పోటీలకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళనలు చేశారు.
ఎద్దుల పందెం కోసం వందల మంది రాస్తారోకో.. వాహనాలు ధ్వంసం
ఎద్దుల పందేనికి అనమతి ఇవ్వాలని ఓ హైవేపై వందల మంది యువకులు బైటాయించారు. వాహన రాకపోకలు జరగకుండా రోడ్డును నిర్బంధించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
పోలీసులు ఆందోళనకారులను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో వారు పోలీసులపై రాళ్లు విసిరారు. అలాగే ఈ దాడిలో కొన్ని వాహనాలను ధ్వంసం అయ్యాయి. అంతేగాక రోడ్డుపై రాళ్లు పోసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. కొందరు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. జిల్లా కలెక్టర్, డీజీపీ ఘటన స్థలానికి చేరుకుని యువతకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి వారు వినలేదు. అయినా రోడ్డు ఖాళీ చేయకుండా పోలీసుల పైకి దాడికి దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్‌ను, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.