తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kerala Covid Cases: కేరళలో 20వేల దిగువకు కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా కేసులు(Corona cases in India) స్థిరంగా నమోదవుతున్నాయి. కేరళలో(Kerala COVID cases) కరోనా ఉద్ధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 19వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

covid cases
కొవిడ్ కేసులు

By

Published : Sep 18, 2021, 8:30 PM IST

దేశంలో కొవిడ్ వ్యాప్తి(Corona cases in India) స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. కేరళలో వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా రాష్ట్రంలో(Kerala COVID cases) 19,352 కేసులు నమోదయ్యాయి. మరో 143 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,88,840 చేరగా.. మృతుల సంఖ్య 23,439కి పెరిగింది.

కేరళవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 27,266 మంది వైరస్​ను జయించారు. దీనితో రికవరీల సంఖ్య 42,83,963కు చేరింది.

ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇలా..

  • కర్ణాటకలో 889 కరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనాతో మరణించారు. 1,080 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,755 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • తమిళనాడులో 1,653 మందికి కొత్తగా కరోనా నిర్ధరణ అయింది. 22 మంది మహమ్మారి వల్ల మరణించారు. 1,581 మంది కోలుకున్నారు.
  • రాజధాని నగరం దిల్లీలో మరో 41 మందికి కరోనా సోకింది. కొవిడ్​ కారణంగా ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు.

వ్యాక్సినేషన్​ రికార్డు..

దేశవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం చేపడుతున్న టీకా కార్యక్రమం(Vaccination in India) మరో మైలురాయిని అందుకుంది. దేశంలో ఇప్పటివరకు 80 కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవియా తెలిపారు.

ఇదీ చదవండి:

covid third wave india: మూడో దశ వ్యాప్తికి అదే కీలకం!

Vaccination In India: దేశంలో 80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details