తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడో రోజూ శ్రీనగర్​ జాతీయ రహదారి బంద్

జమ్ముకశ్మీర్​ను హిమపాతం, వర్షాలు వణికిస్తున్నాయి. అనేక చోట్ల వాహనాలు మంచులో కురుకుపోయాయి. వర్షం వల్ల జమ్ములోని చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో వరుసగా మూడో రోజూ జమ్ము- శ్రీనగర్​ జాతీయ రహదారిని మూసివేశారు. మరో వైపు హిమాచల్​ ప్రదేశ్​లోనూ వర్షాలు, మంచు కురుస్తోంది. కొండ చరియలు విరిగి పడడం వల్ల పలు రోడ్లు దెబ్బతిన్నాయి.

JK: National highway remains blocked for 3rd day
మూడో రోజూ శ్రీనగర్​ జాతీయ రహదారి మూసివేత

By

Published : Mar 24, 2021, 12:44 PM IST

హిమపాతం, పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన కారణంగా మూడో రోజూ జమ్ముకశ్మీర్​ జాతీయ రహదారిని అధికారులు మూసి ఉంచారు. జమ్ముకశ్మీర్​లోని బనిహాల్, రామ్​బన్​ ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా జమ్ము-శ్రీనగర్​ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు.

జమ్ములో ట్రాఫిక్ జామ్
జమ్ముకశ్మీర్​ రహదారిపై వరద నీరు
జమ్ముకశ్మీర్​లో వర్షాలు-శ్రీనగర్​ జాతీయ రహదారి మూసివేత
శ్రీనగర్​ జాతీయ రహదారి మూసివేత
జమ్ముశ్రీనగర్​ జాతీయ రహదారిపై బురదలో ఇరుక్కుపోయిన ట్రక్కు

గాంగ్రో, షెర్బీ బీ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. సీపీపీఎల్​ అనే రోడ్డు నిర్మాణ కంపెనీ రహదారిపై పడిన కొండ చరియల్ని తొలగిస్తోంది.

హిమాచల్​ ప్రదేశ్​లోనూ..

హిమాచల్​ ప్రదేశ్​లోని కులు జిల్లాలో హిమపాతం, వర్షం కారణంగా 10 రోడ్లు దెబ్బతిన్నాయి. లోయలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

రోడ్లపై మంచును తొలగిస్తున్న వాహనం
హిమాచల్​ ప్రదేశ్​ కులులో హిమపాతం-మంచులో ఇరుక్కుపోయిన కారు
కులు జిల్లాలో హిమపాతం- మంచులో ఇరుక్కుపోయిన వాహనం
కులు- మంచులో కూరుకుపోయిన కారు

ఇదీ చదవండి:జమ్ములో భారీ హిమపాతం-రాకపోకలకు అంతరాయం

ABOUT THE AUTHOR

...view details