తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అల్లరి చేస్తున్నారని పిల్లలను ఇంట్లో కట్టేసి వెళ్తే... - children tied with chain

తలకిందులుగా ఇద్దరు చిన్నపిల్లలను కట్టేసి (Parents hang their children with iron chain) ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఇది రాష్ట్ర బాలల హక్కుల కమిషన్​ ఛైర్​పర్సన్​ సంగీతా బెనీవాల్​ దృష్టికి చేరింది. అంతే.. ఆమె నేరుగా చిన్నారుల ఇంటికి వెళ్లారు. అప్పుడే అసలు విషయం బయటపడింది.

parents-hanging-their-children-with-iron-chain
అల్లరి చేస్తున్నారని పిల్లలను ఇంట్లో కట్టేసి వెళ్తే

By

Published : Oct 26, 2021, 7:33 PM IST

రాజస్థాన్​ జైపుర్​లో(Jaipur news) హృదయవిదారక ఘటన జరిగింది. అభం శుభం ఎరుగని ఇద్దరు చిన్నారులను, తలకిందులుగా చైన్లతో కట్టేసి ఉన్న దృశ్యాలు (Parents hang their children with iron chain) కంటతడి పెట్టించాయి. సామాజిక మాధ్యమాల్లో ఇవి వైరల్​గా మారాయి. పిల్లల తల్లిదండ్రులే ఇలా అమానవీయంగా ప్రవర్తించారని అంతా భావించి.. తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్​ ఛైర్​పర్సన్​ సంగీతా బెనీవాల్​కు సమాచారం అందింది. వివరాలు తెలుసుకొని.. ఆమె నేరుగా మంగళవారం మురళీపుర గ్రామంలోని చిన్నారుల ఇంటికెళ్లారు. అప్పుడే అసలు విషయం బయటపడింది.

పిల్లలను గొలుసులతో కట్టేసిన దృశ్యాలు

తల్లిదండ్రులు కాదు..

ఆ మహిళా అధికారి చిన్నారులను విచారించగా.. చైన్లతో కట్టేసి, తలకిందులుగా వేలాడదీసింది తమ తల్లి కాదని, పక్కింటి వ్యక్తి అని చెప్పారు. అలా చేసి.. ఫొటోలు కూడా తీశాడని చెప్పుకొచ్చారు.

పిల్లలతో మాట్లాడుతున్న అధికారి

''మా అమ్మ మమ్మల్ని తాడుతో కట్టేసి వెళ్లింది. కానీ అమ్మ వెళ్లాక.. పక్కింటి బూట్ల అంకుల్​(షూ ధరించే వ్యక్తి) వచ్చాడు. మమ్మల్ని తలకిందులుగా వేలాడదీసి ఫొటోలు తీశాడు. చుట్టుపక్కల వాళ్లు కూడా అప్పుడే వచ్చారు.''

- అధికారితో చిన్నారులు.

చిన్నారుల తల్లిదండ్రులు, కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే అక్టోబర్​ 23న భర్తకు భోజనం ఇచ్చేందుకు పిల్లలను ఇంట్లో వదిలివెళ్లే క్రమంలో తాడుతో (Parents hang their children with iron chain) కట్టేసి వెళ్లింది వాళ్ల అమ్మ.

మహిళా అధికారితో చిన్నారుల తల్లి

కొద్దిరోజుల కింద పిల్లలను(Jaipur news) ఇంట్లో వదిలి వెళ్తే.. వచ్చేసరికి కనిపించలేదని, పోలీస్​ స్టేషన్​లో కేసు కూడా పెట్టామని ఆ తల్లి చెప్పింది. ఆ తర్వాత దొరికారని, అందుకే మళ్లీ అలా జరగకుండా ఈసారి కట్టేసి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది.

పిల్లలతో మాట్లాడుతూ

అలా చేయొద్దు..

అయితే.. దీనిపైనా సంగీతా బెనీవాల్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులను ఇంట్లో వదిలి వెళ్లేటప్పుడు కట్టేయొద్దని, ఇతరుల ఇళ్లలో వదిలి వెళ్లడం మంచిదని హితబోధ చేశారు.

నిందితుడైన పక్కింటి వ్యక్తిపై పిల్లల సంరక్షణ కమిటీ (Child welfare committee (CWC)) చర్యలు తీసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: ఉగ్ర నిధుల కేసులో నలుగురికి జైలు శిక్ష

21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారయత్నం

ABOUT THE AUTHOR

...view details