అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. మే 17న అతి తీవ్ర తుపాను వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. అనంతరం ఒకరోజు తర్వాత ఇది గుజరాత్ తీరం దాటుతుందని తెలిపింది.
ఈ అల్పపీడనం కారణంగా ఏర్పడిన 'తౌక్టే' తుపాను.. శనివారం ఉదయం నాటికి తీవ్ర రూపు దాలుస్తుందని ఐఎండీ తెలిపింది. మే 16- 19 మధ్య ఈ తుపాను వల్ల గంటకు 175 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.