తెలంగాణ

telangana

ETV Bharat / bharat

33% తగ్గిన భారత ఆయుధాల దిగుమతి!

భారత ఆయుధాల దిగుమతి 2011-15తో పోలిస్తే.. 2016-20లో 33 శాతం క్షీణించిందని సిప్రీ నివేదిక వెల్లడించింది. రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించటం, దేశీయ రక్షణ పరిశ్రమకు ఊతమిచ్చేందుకు తీసుకున్న చర్యలే కారణంగా తెలిపింది.

India's import of arms decreases by 33 per cent, says SIPRI
33శాతం పడిపోయిన భారత ఆయుధాల దిగుమతి

By

Published : Mar 15, 2021, 8:12 PM IST

2011-15తో పోలిస్తే 2016-20 కాలంలో భారత​ ఆయుధాల దిగుమతి 33 శాతం మేర క్షీణించిందని స్వీడెన్​కు చెందిన సిప్రీ నివేదిక తెలిపింది. ఫలితంగా సరఫరాదారు రష్యా అమితంగా ప్రభావితమైనట్లు పేర్కొంది. భారత్​కు అమెరికా నుంచి ఆయుధాల దిగుమతి కూడా 46 శాతానికిపైగా క్షీణించినట్లు వెల్లడించింది.

భారత్​ అనుసరిస్తున్న సంక్లిష్ట కొనుగోలు విధానంతో పాటు రష్యా ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నం కూడా అందుకు కారణమని తెలిపింది నివేదిక. అయితే.. రాబోయే రోజుల్లో పలువురు సరఫరాదారుల నుంచి భారత్ పెద్దఎత్తున​ ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు సిప్రీ తెలిపింది.

దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, దేశీయ రక్షణ పరిశ్రమకు ఊతమిచ్చేందుకు కొన్నేళ్ల నుంచి భారత్​ పలు చర్యలు చేపడుతోంది. వాటికి మూలధన సేకరణ కోసం దాదాపు రూ.2లక్షల కోట్లు విలువ చేసే 112 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు రాజ్యసభలో కేంద్రమంత్రి శ్రీపాద నాయక్​ తెలిపారు.

ఇదీ చూడండి:పీఎం కేర్స్ విరాళాల​పై లోక్​సభలో గందరగోళం

ABOUT THE AUTHOR

...view details