కొవిడ్ ఉద్ధృతి సమయంలో పెంచిన రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ (Platform Ticket Price) ధరను తగ్గిస్తున్నట్లు రైల్వే గురువారం ప్రకటించింది. కరోనా వేళ రైల్వే స్టేషన్లలో రద్దీని (Platform Ticket Price) తగ్గించేందుకు టికెట్ ధరను రూ.50గా చేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్లాట్ఫామ్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ప్లాట్ఫామ్ టికెట్ ధరను తగ్గించిన రైల్వే - భారతీయ రైల్వే
ప్లాట్ఫామ్ టికెట్లపై పెంచిన ఛార్జీలను (Platform Ticket Price) తగ్గిస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. దీంతో రూ.50గా ఉన్న ప్లాట్ఫామ్ టికెట్ ధర మళ్లీ రూ.10కు చేరనుంది. దేశవ్యాప్తంగా ఈ ధరల మార్పు అందుబాటులోకి రానుంది.
ప్లాట్ఫామ్ టికెట్ ధరలను తగ్గించిన రైల్వే
తాజాగా రైల్వే చేసిన ప్రకటనతో ప్రయాణికులకు ఊరట కలిగినట్లు అయింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలోను (Platform Ticket Price) ఇక నుంచి మళ్లీ రూ.10కే ప్లాట్ఫామ్ టికెట్ అందుబాటులోకి రానుంది.
ఇదీ చూడండి :కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల ఎగుమతికి కేంద్రం పచ్చజెండా