India Russia: భారత్ రష్యాల బంధం మరింత బలపడేలా సోమవారం ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ రోజున భారత పర్యటనకు రానున్నారు. ఆ దేశంలో కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ దిల్లీ రానుండటం విశేషం.
"డిసెంబర్ 26 పూర్తిగా రష్యా రోజు"గా ఉండనుంది. ఆ రోజంతా పలు స్థాయిల్లో చర్చలు జరగనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ- పుతిన్ల శిఖరాగ్ర సదస్సు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 9.30 గంటల సమయంలో ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు.
ముందు రోజైన ఆదివారం రాత్రే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, రక్షణ మంత్రి సెర్గీ షోయ్గు దిల్లీ చేరుకోనున్నారు. 2+2 బృందంలో భాగంగా ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు చర్చలు జరుపుతారు. అఫ్గానిస్థాన్, ఉగ్రవాదం సమస్యలు ప్రస్తావనకు రానున్నాయి.