తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 15,510 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 15,510 మంది కరోనా​ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 11లక్షల 12వేల 241కి చేరింది. వైరస్​ బారినపడిన వారిలో తాజాగా 11,288 మంది కోలుకున్నారు.

India reports 15,510 new COVID19 cases and 106 deaths in the last 24 hours
దేశంలో మరో 15,510 కేసులు.. 106 మరణాలు

By

Published : Mar 1, 2021, 9:28 AM IST

Updated : Mar 1, 2021, 10:06 AM IST

దేశంలో బుధవారంతో పోల్చితే.. గురువారం కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 15,510 మందికి కొవిడ్​​​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 106 మంది కరోనా​తో మృతిచెందారు.

మొత్తం కేసులు: 1,11,12,241

మరణాలు: 1,57,157

రికవరీల సంఖ్య: 1,07,86,457

యాక్టివ్​ కేసులు: 1,68,627

వైరస్​ సోకిన వారిలో 11,288 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.

పరీక్షలు..

అటు.. గురువారం ఒక్కరోజే 6 లక్షల 27 వేల 668 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 21.68 కోట్లు దాటింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1కోటీ 43లక్షల 1వెయ్యి 266 మందికి కొవిడ్​ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:కొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోదీ

Last Updated : Mar 1, 2021, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details