దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఒక్కరోజే 3,52,991 మందికి పాజిటివ్‌గా తేలింది. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్తగా 2,812 మంది వైరస్‌కు బలయ్యారు. 2,19,272 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. వరుసగా ఐదో రోజూ భారత్‌లో 3 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. పలు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
- మొత్తం కేసులు:1,73,13,163
- మొత్తం మరణాలు: 1,95,123
- మొత్తం కోలుకున్నవారు: 1,43,04,382
- యాక్టివ్ కేసులు:28,13,658
కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ఆదివారం ఒక్కరోజే 14,02,367 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్ టెస్ట్‌ల సంఖ్య 27 కోట్ల 93 లక్షల 21 వేలు దాటింది.