తెలంగాణ

telangana

By

Published : Dec 21, 2021, 9:47 PM IST

ETV Bharat / bharat

భారత్​పై పాక్ దుష్ప్రచారం!.. 20 యూట్యూబ్ ఛానెళ్లు మూసివేత

India Bans Pak Youtube Channels: పాకిస్థాన్​కు చెందిన 20 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్​సైట్లను మూసివేయాలని ఆదేశించింది కేంద్ర సమాచార, ప్రసార శాఖ. భారత్ లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం చేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

india action against pak youtube
భారత్​పై పాక్ దుష్ప్రచారం

India Bans Pak Youtube Channels: దేశ వ్యతిరేక ప్రచారం, నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్​కు చెందిన 20 యూట్యూబ్‌ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లను మూసివేయాలని ఆదేశించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.

భారత్​పై పాక్ ఛానెళ్లు దుష్ప్రచారం

నిఘా సంస్థలతో సమన్వయం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్లు ఓ సమన్వయంతో భారత్‌కు చెందిన వివిధ సున్నిత అంశాలపై తప్పుడు వార్తలను వ్యాపింపజేస్తున్నాయని సమాచార, ప్రసార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్​పై పాక్ ఛానెళ్లు దుష్ప్రచారం

జమ్మూకశ్మీర్‌, భారత సైన్యం, రామమందిరం, మైనార్టీ వర్గాలు, త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌కు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని వెల్లడించింది. భారత్‌లో భయానక, సందేహాస్పద వాతావరణాన్ని సృష్టిస్తున్న ఆయా ఛానళ్లు, వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హెచ్చరించారు.

భారత్​పై పాక్ ఛానెళ్లు దుష్ప్రచారం
భారత్​పై పాక్ ఛానెళ్లు దుష్ప్రచారం

భారత్‌లో నకిలీ వార్తలు, ప్రచారం ద్వారా అస్థిరత లక్ష్యంగా సాగే సీమాంతర కార్యకలాపాలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:లోక్​సభ సమావేశాల కోసం ప్రత్యేక యాప్​- ప్రవేశపెట్టిన స్పీకర్

ABOUT THE AUTHOR

...view details