ఒడిశాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం మధ్యాహ్నం బొగ్గు లోడింగ్ కోసం భద్రక్ నుంచి ధమ్రాకు వెళుతున్న ఈ రైలు బోగీల్లో 13 విడిపోయినట్లు అధికారులు తెలిపారు. చరంపా ప్రాంతంలోని ధమ్రా రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ రైలులో మొత్తం 60 బోగీలున్నాయి. దీనితో కొద్ది సేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు అంతరాయం - పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఫొటోలు
బొగ్గు లోడింగ్ కోసం వెళ్తున్న ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణానష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 10, 2021, 6:37 PM IST