రాజకీయ ప్రవేశంపై ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు క్రియాశీల రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఆయన నటించిన చిత్రం ప్రచారంలో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎవరూ అడగలేదు..

ఎన్నికల్లో పోటీచేయమని తనను ఏ పార్టీ అడగలేదని మమ్ముట్టి తెలిపారు. తాను కూడా అభ్యర్థిత్వం గురించి ఎవరినీ సంప్రదించలేదన్నారు. 'రాజకీయాలపై వ్యక్తిగతంగా నాకో అభిప్రాయం ఉంది. క్రియాశీల రాజకీయాలపై నాకు ఏమాత్రం ఆసక్తి లేదు కాబట్టి నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు' అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :కేరళలో బంగారం స్మగ్లింగ్ మాటేమిటి?: షా