తెలంగాణ

telangana

బాలికపై ఐబీ మాజీ అధికారి అత్యాచారం.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ!

By

Published : Mar 9, 2022, 11:53 AM IST

Updated : Mar 9, 2022, 12:15 PM IST

IB Officer Rapes Girl: 17 ఏళ్ల మైనర్​పై నిఘా విభాగ(ఐబీ) మాజీ అధికారి అత్యాచారానికి పాల్పడిన ఘటన దిల్లీలో జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తన తోటి విద్యార్థినే మరో నలుగురు విద్యార్థులు కిడ్నాప్​ చేసి.. చితకబాదారు. ఈ ఘటన హరియాణాలో వెలుగుచూసింది.

Delhi rape case
Delhi rape case

IB Officer Rapes Girl: దిల్లీ కరోల్​ బాగ్​లో నిఘావిభాగ (ఐబీ) మాజీ అధికారి దారుణానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశ చూపి.. 17 ఏళ్ల బాలికపై ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ అధికారి (60) అత్యాచారానికి పాల్పడ్డాడు.

స్నేహితురాలి తండ్రే..

"హైస్కూల్​ విద్య పూర్తి చేసి.. ప్రస్తుతం బ్యుటీషియన్​ కోర్సు చేస్తున్న బాలికకు.. ఆమె స్నేహితురాలి తండ్రి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించాడు. ఇదే సాకుతో ఆ బాలికను మార్చి 7న కరోల్​ బాగ్​లోని ఓ హోటల్​కు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఇంటి వద్ద దింపేసి, ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. అయితే మహిళా దినోత్సవం తర్వాత రోజే ఆ ఘటన గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పింది." అని అధికారులు తెలిపారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు .. కరోల్ బాగ్​ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. ఉత్తర్​నగర్​కు చెందిన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కిడ్నాప్​ చేసి.. చితకబాది..

మరో ఘటనలో సహచరుడినే అపహరించి, చితకబాదారు నలుగురు విద్యార్థులు. హరియాణా గురుగ్రామ్ జిల్లాలో ఇది వెలుగుచూసింది. ఓ పార్టీకి తమకు ఉచిత ప్రవేశాన్ని నిరాకరించినందుకు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

బాధిత బాలుడిని తమ హోండా సిటీ కారులో అపహరించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు.. అతడిని విచక్షణారహితంగా చితకబాదారు. ఎలాగోలా అక్కడి నుంచి పారిపోయి బాధితుడు తన కుటుంబ సభ్యులకు విషయాన్ని వివరించాడు. దీంతో కుటుంబ సభ్యులు.. సెక్టార్​ 56 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నలుగురు విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చూడండి:దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరణాలు

Last Updated : Mar 9, 2022, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details