Old Pens In Bank Locker : సాధారణంగా బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అలా చేస్తే అవి దొంగలబారిన పడకుండా భద్రంగా ఉంటాయని భావిస్తారు. అయితే బిహార్‌లోని గయాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం దాదాపు 140ఏళ్ల క్రితం నాటి పెన్నులను బ్యాంకు లాకర్లతో దాస్తున్నారు. పెన్నులను లాకర్లలో భద్రపరచడమేంటి? ఆ పెన్నుల ప్రత్యేకత ఏంటి? వాటి ధర ఎంత ఉంటుంది? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గయాకు చెందిన మహ్మద్ జావేద్ యూసుఫ్‌కు పెన్నులను సేకరించడం అంటే ఇష్టం. అతడికి ఆ అభిరుచి పూర్వీకుల నుంచి వచ్చింది. అందుకే 140ఏళ్ల క్రితం పెన్నులను జావేద్ భద్రపరుస్తున్నాడు. ప్రస్తుతం అతడి వద్ద 100కు పైగా ప్రముఖ కంపెనీలకు చెందిన పెన్నులు ఉన్నాయి. వాటి ధర పస్తుత కాలంలో రూ. కోటికి పైగా ఉంటుందని అంచనా. ఈ పెన్నులు 1880 నుంచి 1960 మధ్య సేకరించినవే. తండ్రి, తాత సేకరించిన పెన్నులను జావేద్ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు.
ఖరీదైన పెన్నుల కొనుగోలు
మహ్మద్ జావేద్ యూసుఫ్ తాత బ్రిటిష్ ప్రభుత్వంలో డీఎస్పీ కాగా, తండ్రి జిల్లా మేజిస్ట్రేట్. వారిద్దరికీ పెన్నులు కొనడం అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే జావేద్ తాత, తండ్రి రాయడానికి ఖరీదైన, అరుదైన పెన్నులు కొనుగోలు చేసేవారు. పార్కర్, పెలికాన్, ఐకర్ షార్ప్, రోల్డ్ గోల్డ్, షాఫర్స్, క్రాస్ డాట్ వంటి బ్రాండెడ్ కంపెనీల పెన్నులు, పెన్సిళ్లను వాడేవారు. 100ఏళ్ల క్రితమే వీటి ధర వేలల్లో ఉండేది. ప్రస్తుత కాలంలో వీటి ధర రూ. లక్షలకు చేరింది. తాత, తండ్రిని చూసి పెరిగిన జావేద్‌కు పెన్నులంటే ఇష్టం పెరిగింది. పెన్ను ఇంక్ అయిపోయినా, రాయకపోయినా వాటిని బయటకు విసిరేయకుండా దాన్ని రిపేర్ చేసి దాచేశారు జావేద్ తండ్రి, తాత. వారి మరణాంతరం పెన్నులను భద్రపరిచే బాధ్యతను జావేద్ తీసుకున్నాడు. పెద్ద పెద్ద బ్రాండ్ల ఖరీదైన పెన్నులను కొనుగోలు చేశాడు.
"నా వద్ద ఉన్న పెన్నులన్నీ అమెరికా, లండన్, ఫ్రాన్స్ తదితర విదేశాల నుంచి ఆర్డర్ చేసినవే. పార్కర్, షాఫర్స్ వంటి కంపెనీల పెన్నుల ధర ప్రస్తుత కాలంలో రూ. 2లక్షలు- రూ.5 లక్షల వరకు ఉంటుంది. నా వద్ద ఉన్న 100కు పైగా పెన్నులు చాలా ఖరీదైనవి, అరుదైనవి. ప్రస్తుత కాలంలో చాలా పెన్నులు మార్కెట్ల్లో దొరకడం లేదు. ఆంగ్లేయుల పాలనా కాలంలో మా పూర్వీకులు రూ. నలభై వేలకు ఓ పెన్సిల్ సెట్ కొన్నారు. దాని ధర ఇప్పుడు రూ.3 లక్షలు నుంచి రూ. 5లక్షల వరకు ఉంటుంది. ఎందుకంటే అవి బంగారంతో చేసిన పెన్సిళ్లు. " అని మహ్మద్ జావేద్ యూసుఫ్ తెలిపాడు.
పెన్నుల ప్రత్యేకత ఏమిటంటే?
జావేద్ యూసుఫ్ వద్ద ఉన్న అన్ని పెన్నుల నిబ్ బంగారం, ప్లాటినంతో తయారుచేసినవే. 24 క్యారెట్ల బంగారంతో చేసిన పెన్నులు కూడా ఉన్నాయి. కొన్ని పెన్నుల తయారీ ప్రస్తుతం నిలిచిపోయింది. తన వద్ద బంగారం, వెండి, రాగి, కలప, వెదురు, పేపర్‌తో తయారుచేసిన పెన్నులు ఉన్నాయని జావేద్ యూసుఫ్ చెప్పారు. 100 ఏళ్ల క్రితం నాటి పెన్నులు అయినా జావేద్ యూసుఫ్ వద్ద ఉన్న పెన్నులన్నీ ఇప్పటికీ రాస్తున్నాయి. పెన్నులు ఖరీదైనవి కాబట్టి జావేద్ వాటిని బ్యాంక్ లాకర్లో భద్రపరుస్తున్నాడు. 2-3 నెలలకొకసారి పెన్నులను బ్యాంక్ లాకర్ నుంచి బయటకు తీసి శుభ్రం చేస్తాడు జావేద్. వాటికి నూనె రాసి పాలిష్ చేసి మళ్లీ బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తాడు. అందుకు అవి ఇప్పటికీ కొత్తవిలా కనిపిస్తాయి.
UGC NET ప్రశ్నాపత్రం నకిలీ స్క్రీన్‌షాట్ సర్క్యులేట్- పాఠశాల విద్యార్థిపై CBI ఛార్జ్‌షీట్!
'నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్ జరగలేదు'- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్