రామాయణ కథాంశాన్ని అనేక విధాలుగా వెండితెరపై ప్రేక్షకులు చూశారు. తాజాగా కూడా రామాయణం ఆధారంగా కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు రామాయణం కథను వెబ్‌సిరీస్‌గా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. సుమారు రూ.750 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను నితీష్ తివారీ రూపొందించనున్నట్లు సమాచారం.
రామ, రావణులుగా రణ్‌బీర్, హృతిక్- రూ.750 కోట్లతో వెబ్‌సిరీస్! - రణ్‌బీర్ కపూర్
భారీ బడ్జెట్‌తో సరికొత్త కోణంలో రామాయణం వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులో రామ, రావణులుగా రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్ నటించబోతున్న తెలుస్తోంది. దీనికోసం వారిద్దరికి చెరో రూ.75 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇందులో రామ, రావణులుగా రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్(Hrithik Roshan new web series) నటించబోతున్నారట. దీని కోసం ఇద్దరికీ చెరో రూ.75 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మధు మంతెన దీన్ని నిర్మించనున్నారు. "ఇప్పటివరకూ రామాయణాన్ని చూడని విధంగా చాలా భారీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు" అని నితీష్ సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో సీతగా కరీనా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నా వాటిలో నిజం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి:sam chaitanya divorce: ట్వీట్ వైరల్‌పై స్పందించిన సిద్ధార్థ్