Groceries Shopping Tips in Telugu: ప్రతి నెలా ఇంటికి కావాల్సిన కిరాణా సరుకులు కొనుగోలు చేసేందుకు చాలా మంది సూపర్ మార్కెట్లకు, మాల్స్‌కు వెళ్తుంటారు. అన్నీ ఒకేదగ్గర దొరుకుతాయనో.. ధర ఒకటీరెండు రూపాయలు తక్కువగా ఉంటుందనో వెళ్తుంటారు. అయితే.. కొనుగోలు పూర్తయ్యే సరికి బడ్జెట్ దాటిపోయి ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.
లిస్ట్ తయారు చేసుకోండి:ఇంట్లో కావాల్సిన వస్తువులు, సరుకులు కొనేటప్పుడు బడ్జెట్ ముందుగా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి. దీనికోసం.. సూపర్ మార్కెట్ లేదా మాల్స్‌కు వెళ్లడానికి ముందే.. మన ఇంట్లో ఏం ఉన్నాయో చూసుకోవాలి. లేనివాటితో ఓ లిస్ట్ తయారు చేసుకోవాలి. దీనివల్ల.. ఇంట్లో వస్తువులు ఉండగానే మరోసారి కొనుగోలు చేయాల్సిన అవసరం రాదు.
హద్దు దాటొద్దు : మీరు ఎప్పుడు ఎలాంటి షాపింగ్‌కు వెళ్లినా.. ఒక రూల్ పెట్టుకోవాలి. అదేమంటే.. మీరు కచ్చితంగా లిస్టు తయారు చేసుకొని వెళ్లాలి. అంతవరకే కొనుగోలు చేయాలి. ఎంత ఊరించినా సరే.. మీ లిస్టులో లేని వస్తువు కొనుగోలు చేయకూడదు. చాలా మంది డబ్బు దుబారా చేసేది ఈ విషయంలోనే! 10 వస్తువులు కొనడానికి వెళ్లి.. పాతిక వస్తువులు ఇంటికి మోసుకెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితికి వెంటనే చెక్ పెట్టగలిగితే.. చాలా డబ్బు ఆదా అవుతుంది.
కార్తికమాసం-ఈ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైనా దర్శించుకోవాలట!
ఆఫర్ల మాయలో పడకండి :ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అనో.. మూడు కొంటే కొంత డబ్బు కలిసి వస్తుందనో.. ఆఫర్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. ఆ వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. మీ దృష్టి మీ లిస్టు మీద మాత్రమే ఉండాలి. ఎలాంటి ఆఫర్లు ఎంత ఊరించినా.. బడ్జెట్ దాటివెళ్లకండి.