Horoscope Today: ఈరోజు (13-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం;శుక్లపక్షం
దశమి:రా. 12.25 తదుపరి ఏకాదశి
రేవతి:తె.5.15 తదుపరి అశ్విని
వర్జ్యం:సా. 4.43 నుంచి 6.23 వరకు
అమృత ఘడియలు:రా. 2.44 నుంచి 4.24 వరకు
దుర్ముహూర్తం:మ. 12.16 నుంచి 1.00 వరకు తిరిగి మ. 2.28 నుంచి 3.12 వరకు
రాహుకాలం:ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం:ఉ.6.25, సూర్యాస్తమయం: సా.5-24
మేషం
గట్టి సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది.
వృషభం
వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్నిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
మిథునం
శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలున్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడికి లోనవకుండా, ఓర్పుగా వ్యవహరించండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా చేయవచ్చు. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.
సింహం
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేదాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.
కన్య
మంచిపనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. గోవింద నామాలు పఠించడం మంచిది.
తుల
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. శుభఫలితాలున్నాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.
వృశ్చికం
అందరినీ కలుపుకుపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనులయందు విజయం కోసమై గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.
ధనుస్సు
కొన్ని విషయమాలలో మీరు అనుకున్నదానికంటే ఎక్కువశ్రమ పడాల్సి వస్తుంది. నవమంలో చంద్ర స్థితి అనుకూలించడంలేదు. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.
మకరం
ప్రయత్నకార్య సిద్ధి కలదు. కుటుంబసభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభాన్నిస్తుంది.
కుంభం
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇస్టులతో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాటాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. గణపతి సందర్శనం మంచినిస్తుంది
మీనం
ధర్మసిద్ధి ఉంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. పొదుపును పాటించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శివనామాన్ని జపించాలి.
ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్ 12 - డిసెంబర్ 18)