Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 25) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు రాశిఫలాలు
By
Published : Feb 25, 2023, 6:32 AM IST
Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 25) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఈ రోజు మీరు ఆధిపత్య ధోరణితో ఉంటారు. కొత్త ప్రయత్నాలు, పనులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొత్తవి ప్రయత్నించకండి. అందరితో చక్కగా మాట్లాడండి.
మీరు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివిధ సమస్యలు నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి.
ఈరోజు మీరు పట్టింది బంగారం అవుతుంది! వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది, పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. స్నేహితులు కూడా సహాయ పడతారు. సంబంధ భాంధవ్యాలు పెంచుకోండి.
మీ కుటుంబంలోని చిన్నవారిపై మీరు ఈరోజు అధిక శ్రద్ధ పెడతారు. పిల్లలు వారి రోజువారీ పనులు మెరుగుపరుచుకునే విషయంలో తగిన సూచనలిస్తారు.
ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలు మిమ్మల్ని తీరిక లేకుండా చేయవచ్చు. మీరు ఒక తీర్థయాత్రకి ప్రణాళిక వేసే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించిన ఏదైనా విషయంలో మనస్తాపం ఉండవచ్చు.
ఈ రోజు మీ స్నేహితులు తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి మీ వద్ద ప్రస్తావిస్తారు. అవి మీ ఊహకు ఉత్సుకత కలిగించే అవకాశం ఉంది.
మీరు మీ ప్రేమ జీవితంలో మిరుమిట్లు గొలిపే సమయాన్ని ఊహించవచ్చు. వివాహితులు తమ భాగస్వాముల కొరకు తమ ప్రేమను పునఃఆవిష్కరించే ప్రక్రియలో ఉంటారు. అంతేగాక ప్రియమైన వారితో మీ ప్రయాణం ఆనందకరంగా ఉంటుంది.
మీ కుటుంబ వాతావరణం ఈరోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉండాలని భావిస్తారు. మీ విరోధులు ఈరోజు ఓటమిని అంగీకరిస్తారు. మీకు మీ సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది.
మీరు ఈ రోజు మానసికంగా అస్థిరంగా భావిస్తారు. మీరు జీర్ణసంబంధ రోగాలకు తీసుకునే మందులపై జాగ్రత్త వహించండి.
ఈ రోజు మీరు శారీరకంగా, మానసికంగానూ అత్యుత్సాహంతో ఉంటారు. కానీ అనుకోని సంఘటనలు మీ కుటుంబ సభ్యులను బాధిస్తాయి. నీరు పొదుపుగా వాడండి. మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు.
నిర్ణయాలు తీసుకునే మీ శక్తిపై ఆత్మవిశ్వాసం, గందరగోళం ప్రభావం చూపుతాయి. ఈ కారణంగా సులభమైన పరిష్కారాలు కనుగొనడంలోనూ ఇబ్బందిపడతారు. మీ రోజువారీ పనుల ప్రకారం వెళ్లండి. వివాదాలకు దూరంగా ఉండండి.
ఈ రోజు మీరు ఒకరి హృదయాన్ని గాయపరిచే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో స్థిరమైన సంబంధం నెలకొల్పుకోవాలనే కోరిక కూడా మీలో ఉంటుంది. వివాహితుల మధ్య సంబంధాలు బలంగా ఉంటాయి.