తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 17) రాశి ఫలాల ఎలా ఉన్నాయో చూసుకోండి.

horoscope-today
horoscope-today

By

Published : Feb 17, 2023, 6:21 AM IST

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 17) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఈరోజు మీకు పేలవంగా ఉంటుంది. మీరు అలసటగా, బద్దకంగా, అశాంతిగా ఉండటానికి అవకాశం ఉంది. మీరు చాలా నిరుత్సాహంగా ఉండటం వల్ల, అసలు ఏమీ చేయడానికి మొగ్గుచూపరు. మీరు మీ దూకుడు గురించి ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. చిన్న సమస్యల గురించి కోపం తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి.

మీరు ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు. మీరు నూటికి నూరుపాళ్ళు ఆరోగ్యంగా, ఫిట్​గా ఉంటారు. ఆరోగ్యం చక్కగా ఉండేందుకు మంచి పోషకాహారం తీసుకోండి. ఆందోళన, శారీరక అలసట చాలా చికాకు కలిగిస్తాయి. ఆఫీసు పనిలో మీరు అలసిపోతారు. ప్రయాణాలు ఫలవంతం. వీలైతే, ఆధ్యాత్మికంగా గడపండి.

ఈ రోజు మీ ఫలితాల్లో భౌతిక సుఖాల్లో తృప్తి, ఆనందం ఉంది. మీరు స్నేహితులను కలుసుకోవచ్చు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా ట్రిప్​కు వెళ్లి రావచ్చు. మీరు కొత్త బట్టల కోసం షాపింగ్​కు వెళ్లవచ్చు. శారీరకంగా మీ ఫిట్​నెస్, సామాజికంగా మీ కీర్తి ప్రతిష్ఠలు అన్నీ ఉచ్చ స్థాయిలో ఉంటాయి. మీ పార్టనర్ తో మీ సంబంధం మీకు స్పూర్తినిచ్చేదిగా ఉంటుంది.

మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో వాతావరణం విపరీతమైన ఆనందోత్సాహాలతో ఉంటుంది. అవి కొద్ది క్షణాలే కావచ్చు. కానీ ఆనందప్రదమైనవి. మీరు ఈ రోజు పూర్తి చేసిన పనులకు ఈ రోజే మెప్పు లభిస్తుంది. శారీరకంగా ఈ రోజు మీరు ఫిట్​గా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడుపుతారు. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు చాలా మంచి రోజు. సహోద్యోగులు సహకరిస్తారు. మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ ఓటమి పాలైనట్టే.

మీరు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. మీ కల్పనా శక్తి వెయ్యింతలవుతుంది. ప్రకృతి పరంగా కవితలు రాసేందుకు తగిన ప్రేరణ ఉంటుంది. ప్రియమైనవారిని కలుసుకుని ఆనందిస్తారు. మీరు మీ పిల్లల ప్రోగ్రెస్ గురించి సమాచారం అందుకుంటారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. స్నేహితుల నించి లబ్ధి ఉండవచ్చు. మీరు దాన సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈ రోజు మీకు అనుకూలం కాదు. మానసికంగా శారీరకంగా మీరు చాలా ఒత్తిడి అనుభవిస్తుంటారు. ఇష్టమైన వారితో కూడా మీరు తగాదా పడుతుంటారు. ఆరోగ్య సంబంధమైన చింత ఉంటుంది. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా భద్రపరచండి. నీటి భయం ఇబ్బంది పెడుతుంది. ఆడవారితో సాంగత్యం వదిలేయండి. అవమానకరమైన పరిస్థితులు ఉండే విషయాలన్నీ తప్పించెయ్యండి. ఖర్చులు ఉండవచ్చు.

ఈ రోజు మీకు చాలా ఫలప్రదంగా గడుస్తుంది. మీ సోదరులతోనూ, సంబంధీకులతోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఒక తీర్థయాత్ర ఉండవచ్చు. ఆర్థిక సంబంధమైన ఫలితాల్లో ఉంది. విదేశాల నించి శుభవార్త అందుకుంటారు. బయటి ప్రదేశాల్లో నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు, కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈ రోజు కొత్త విషయాలేవైనా మొదలుపెట్టడానికి సరైన రోజు. శారీరకంగానూ, మానసికంగానూ కూడా మీరు చెదరకుండా ఉంటారు. ఈ రోజు పెట్టుబడి చేసేవారికి చాలా మంచి రోజు.

మీరు లాభించని రోజులో ఉన్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో వాదన పెట్టుకునే పరిస్థితులను రానీయకండి. కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలు తొలగించుకోండి. ఈ సమస్యలకు సంబంధించి మాత్రమే కాకుడా మీ శారీరిక ఆరోగ్యం గురించి కూడా మీరు పట్టించుకోవలసి వస్తుంది. ప్రతికూల ఆలోచనలు మానేసి, అనైతికమైన కార్యకలాపాల నుంచి దూరంగా ఉండండి. విద్యార్థులకు చెప్పే విషయం త్వరగా అవగాహనకు రాదు.

మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు తీసుకునే కొత్త అసైన్మెంట్లన్నీ సరైన టైంలో పూర్తి చేస్తారు. ఫలితాల్లో ఆర్థిక లబ్ధి రాసి ఉంది. తీర్థయాత్ర చెయ్యవచ్చు. మీరు బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లవచ్చు. బంధువులతో మాట్లాడుకున్న సంతోషంతో మీరు మరింత ఆనందంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం సౌకర్యంగా, ఆనందదాయకంగా గడుస్తుంది. ఈ రోజు మీరు స్థిరంగా ప్రవర్తిస్తారు. మీరు మంచి రుచికరమైన భోజనం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

చూసి అడుగెయ్యమని మీకు సలహా ఇస్తున్నాం. మీరు పని చేసే రంగంలోని వారి సాయం మీకు ఉంటుంది. మీరు సంపాదించిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేస్తారు. మీరు ధార్మిక, సామాజిక కార్యకలాపాలలో ఎక్కువ పాల్గొనడం వల్ల ఖర్చు అధికం అవుతుంది. ఆరోగ్య సంబంధమైన ఆందోళన ఉండవచ్చు. మీకు మీ బంధువులతోనూ, పుత్రులతోనూ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఈ రోజు మీరు ఎముకలు సున్నమయ్యే వరకు పని చేస్తూనే ఉంటారు. మీరు చాలా చికాకు, వ్యాకులతతో గడుపుతారు. జాగ్రత్త!

ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు లాభాలతో చాలా సంతోషంగా ఉంటారు. ఇది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. వాణిజ్యంలో ఉన్నవారు ప్రత్యేకంగా ఒక ఫలవంతమైన రోజు కోసం ఎదురుచూడవచ్చు. ప్రతిష్ఠ, ప్రజాదరణ పెరగవచ్చు.

ఈరోజు మీకు ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉంటుంది. మీ పైఅధికారులు చాలా కృతజ్ఞతా భావంతో ఉంటారు. మీరు వ్యాపారంలో ఉన్నా లేక సేవల రంగంలో ఉన్నా, మీరు సానుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. మారిన పరిస్థితుల గురించి మీరు సంతోషంగా ఉంటారు. మీ తండ్రి, పెద్దల నుండి లాభాలు, ప్రయోజనాలు ఆశించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details