Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 10) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..
ఈ రోజు రాశి ఫలాలు
By
Published : Feb 10, 2023, 6:35 AM IST
Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 10) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..
ప్రారంభించిన పనులలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య విషయాల్లో బంధుమిత్రులను కలుపుకొని పోవడం మంచిది. చిన్నచిన్న ఆటంకాలున్నా పెద్దగా ఇబ్బంది పెట్టవు. వేంకటేశ్వర స్వామి సందర్శనం మంచిది.
ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలుపెట్టండి. తోటివారి సహకారం ఉంటుంది. ఎవ్వరితోనూ విభేదాలు పెట్టుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవబలం రక్షిస్తోంది. లక్ష్మీ ఆరాధన శుభాన్నిస్తుంది.
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర కలహ సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ఈశ్వర ధ్యానం శుభప్రదం.
మీ మీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం
మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేయ గలుగుతారు. శరీర సౌఖ్యం ఉంది. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి, అధైర్య పడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు సంప్రాప్తమవుతాయి. దుర్గాస్తుతి పఠించడం మంచిది.
మనఃస్సౌఖ్యం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. కుటుంబసభ్యుల సలహాలు బాగా ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఈశ్వరారాధన శుభప్రదం.
చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. నూతన వస్తువులు మీ ఇంటికి వస్తాయి. విష్ణు సహస్రనామాలు పారాయణ చేస్తే ఇంకా మంచిది.
అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యవిషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్నివిషయాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగండి, మంచి చేకూరుతుంది. ఆరోగ్యకరమైన పద్దతులను అవలంబించడం మంచిది. గోసేవ చేయడం మంచిది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమతో కూడిన విజయాలున్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో ఆపదలు దూరమవుతాయి. దుర్గాదేవి దర్శనం మంచిది.
మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మంచి మనస్సుతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రీ రామ నామం శక్తినిస్తుంది.
మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.