Horoscope Today (18-07-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు రాశి ఫలం తాజా వార్తలు
Horoscope Today (18-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
రాశి ఫలం
By
Published : Jul 18, 2022, 4:40 AM IST
Horoscope Today (18-07-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రమతోకూడిన విజయాలున్నాయి. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. దుర్గదేవి స్తోత్ర పారాయణ చేయడం మంచిది.
అనుకూల పరిస్థితులున్నాయి. కీలక ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నూతన వస్తువులను కొంటారు. తోటివారి సహాయ సహకారాలున్నాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
శుభకాలం. దైవబలం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. గణపతి నామాన్ని స్మరించడం మంచినిస్తుంది.
చేపట్టే పనిలో అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. బంధువుల వ్యవహారాలలో అతిచొరవ తీసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆదిత్య హృదయ పారాయణం మేలు చేస్తుంది.
సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప లాభాన్నిస్తాయి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అదిగమించే ప్రయత్నం చేస్తారు. సూర్య స్తుతి శక్తినిస్తుంది.
మీ మీ రంగాల్లో అనుకూలఫలితాలున్నాయి. మీరు ఊహించిన దానికంటే అధిక ధనలాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది. శత్రువులమీద మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.
అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. దైవారాదన మానవద్దు.
ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారుల సహకారంతో పనులు పూర్తవుతాయి. కుటుంబంలో చిన్నపాటి అబిప్రాయబేధాలు వస్తాయి. దుర్గ స్తోత్రం పఠించాలి.
ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అధికారులతో నమ్రతగా ప్రవర్తించవలసి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. దత్తాత్రేయ సహస్రనామావళి పఠించడం మంచిది.
విశేషమైన శుభఫలితాలున్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. తలపెట్టిన పనిలో విజయం సిద్ధిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. చంద్రధ్యానం శుభప్రదం.
కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి.