తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2022, 5:02 AM IST

ETV Bharat / bharat

Horoscope Today (07-03-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today (07-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope today
horoscope today

Horoscope Today (07-03-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

బలమైన సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది.

మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొని పోవడంవల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది

శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలున్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.

ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడికి లోనవకుండా, ఓర్పుగా వ్యవహరించండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా చేయవచ్చు. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

మంచిపనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. గోవింద నామాలు పఠించడం మంచిది.

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విబేదాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.

కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

స్థిర చిత్తంతో చేసే పనులు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రగ్రహ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

మీ మీ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. చంద్ర ధ్యానం జపించడం ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details