Horoscope Today (05-03-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
Horoscope Today (05-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
Horoscope Today
By
Published : Mar 5, 2022, 4:52 AM IST
Horoscope Today (05-03-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మధ్యమ ఫలితాలున్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.
మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. కుటుంబసభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం పఠించాలి.
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరమునకు తగిన సహాయం అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభదాయకం.
ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిర బుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ చేస్తే బాగుంటుంది.
శుభ ఫలితాలున్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవ్వరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన చేస్తే మంచిది.
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. దైవారాధన మానవద్దు.
పనులకు ఆటంకాలు కలగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
ముఖ్యమైన విషయాల్లో శుభ ఫలితాలు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కీలక లావాదేవీలను నిపుణులతో సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం.