తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (06-12-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - horoscope today telugu eenadu

ఈ రోజు రాశిఫలాల (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
రాశి ఫలాలు

By

Published : Dec 6, 2021, 4:55 AM IST

ఈరోజు (06-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం

శుక్లపక్షం విదియ: ఉ. 9.09 తదుపరి తదియ మూల: ఉ. 8.36 తదుపరి పూర్వాషాఢ

వర్జ్యం: ఉ. 7.04 నుంచి 8.36 వరకు తిరిగి సా. 5.34 నుంచి 7.04 వరకు

అమృత ఘడియలు: రా.2.32 నుంచి 4.02 వరకు

దుర్ముహూర్తం: మ.12.12 నుంచి 12.56 వరకు తిరిగి మ.2.24 నుంచి 3.08 వరకు

రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.6.20, సూర్యాస్తమయం: సా.5-21

మేషం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివారాధన మంచిది.

వృషభం

విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం మేలు చేస్తుంది.

మిథునం

శుభకాలం. మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

మీమీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడవలసి వస్తుంది. సహనం కోల్పోకూడదు. నిదానంగా అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మి సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

సింహం

వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. ఇష్టదేవత సందర్శనం ఉత్తమం.

కన్య

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

తుల

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

వృశ్చికం

మంచి ఫలితాలను అందుకుంటారు. మీ చిత్తశుద్దే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు

గ్రహబలం అనుకూలంగా లేదు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

మకరం

గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీమీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

కుంభం

శుభకాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనోబలం పెరగటానికి లక్ష్మి ధ్యానం శుభప్రదం.

మీనం

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి.

ఇదీ చూడండి:ఇదీ చూడండి:weekly horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్‌ 05 - డిసెంబర్‌ 11)

ABOUT THE AUTHOR

...view details