తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (25-04-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - గ్రహం అనుగ్రహం

Horoscope Today (25-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today

By

Published : Apr 25, 2022, 4:34 AM IST

Horoscope Today (25-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్​ నామ సంవత్సరం;

ఉత్తరాయణం; వసంత ఋతువు; చైత్రమాసం; బహుళ పక్షం;

దశమి: తె. 3.52 తదుపరి ఏకాదశి ధనిష్ఠ : రా. 7.37 తదుపరి శతభిషం

వర్జ్యం: తె. 2.34 నుంచి 4.07 వరకు అమృత ఘడియలు: ఉ.9.43 నుంచి 11.14 వరకు

దుర్ముహూర్తం: మ.12.22 నుంచి 1.12 వరకు తిరిగి 2.52 నుంచి 3.42 వరకు

రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.5.42, సూర్యాస్తమయం: సా.6.13

మీ మీ రంగాల్లో పెద్దల నుండి మన్ననలను పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధనధాన్య వృద్ధి, సన్మానం, సుఖం, విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సుసౌఖ్యం, ధైర్యం, శరీరబలం, కీర్తి, భోజన సౌఖ్యం లభిస్తాయి. శ్రీ విష్ణు ఆరాధన శుభదాయకం

స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది .

పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించాలి.

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనుల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవిందా నామాలు పఠిస్తే ఉత్తమం.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి.

మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నియంత్రణ అవసరం. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

మనఃస్సౌఖ్యం ఉంది. మీ మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతిని పఠిస్తే శుభం కలుగుతుంది.

ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాల్లో అశ్రద్ధ రానీయకండి. ఇష్టదైవారాధన శుభాన్నిస్తుంది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్మామి దర్శనం శ్రేయోదాయకం.

సుఖ సౌఖ్యాలున్నాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థికంగా శుభయోగం ఉంది. సూర్య ఆరాధన శుభదాయకం.

ఇదీ చూడండి :జేసీబీతో ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు!

ABOUT THE AUTHOR

...view details