తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జవాన్​ హనీట్రాప్- పాక్​కు రహస్య సమాచారం!

పాక్​కు సమాచారం చేరవేస్తున్న సైన్యానికి చెందిన ఓ జవాన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జవాను.. హనీ ట్రాప్​లో చిక్కుకున్నాడని పోలీసులు తెలిపారు. సైన్యానికి చెందిన రహస్య సమాచారాన్ని ఫేస్​బుక్​లో పంపినట్లు చెప్పారు.

Honey-trapped soldier held in Rajasthan for spying charges
జవాను హనీట్రాప్- పాక్​కు రహస్య సమాచారం!

By

Published : Mar 14, 2021, 11:26 AM IST

Updated : Mar 14, 2021, 11:58 AM IST

భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్​ ఐఎస్ఐ ఏజెంట్​కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో ఓ సైనికుడిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ జవాను.. పాక్ యువతి ఉచ్చులో చిక్కుకున్నట్లు నిఘా విభాగం పోలీసులు గుర్తించారు. నిందితుడిని లక్ష్మణ్​​గఢ్​కు చెందిన ఆకాశ్ మెహ్రియాగా గుర్తించారు.

2018లో సైన్యంలో చేరిన ఆకాశ్.. 2019లో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అతనిపై అధికారులు నిఘా ఉంచగా.. పాకిస్థాన్​కు చెందిన ఓ మహిళా ఏజెంట్​తో ఫేస్​బుక్​లో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. సైన్యానికి సంబంధించిన రహస్య వివరాలను ఆమెకు పంపిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై మరింత విచారణ చేపట్టగా.. డబ్బు తీసుకొని సమాచారం పంపిస్తున్నట్లు తేలింది.

అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'ఆ ఉగ్రవాదులను పట్టించిన వారికి రివార్డు'

Last Updated : Mar 14, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details