తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ 22 మంది కంటే నా ప్రాణం విలువైందేం కాదు.. నాకు భద్రత వద్దు'

Asaduddin Owaisi: జడ్​ కేటగిరీ భద్రతను అంగరీకరించాలని కేంద్ర హొంమంత్రి అమిత్​ షా తనను పార్లమెంటు వేదికగా కోరారని తెలిపారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ. సీఏఏ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన 22 మంది జీవితాల కంటే తన ప్రాణం విలువైందని కాదని, చట్టూ ఆయుధాలు లేకుంటేనే తనకు స్వేచ్ఛగా ఉంటుందని చెప్పారు.

owaisi news
అసదుద్దిన్​ ఒవైసీ

By

Published : Feb 7, 2022, 5:57 PM IST

Updated : Feb 7, 2022, 6:26 PM IST

Asaduddin Owaisi Amit Shah: ప్రభుత్వం కల్పించాలనుకుంటున్న జడ్​ కేటగిరీ భద్రతకు ఒప్పుకోవాలని పార్లమెంటు వేదికగా అమిత్ షా తనను కోరారని చెప్పారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ. అయితే సీఏఏ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన 22మంది కంటే తన జీవితం విలువైందేం కాదని అమిత్​ షాకు తాను చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

'నా చుట్టూ ఎవరైనా ఆయుధాలతో ఉంటే నాకు నచ్చదు. నేను స్వేచ్ఛాజీవిని. స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నా' అని ఒవైసీ తెలిపారు.

ఫిబ్రవరి 3న ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీకి తిరిగివస్తుండగా.. ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఛాజర్సీ టోల్​గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. కాల్పుల వీడియో కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Owaisi Z category security

ఈ నేపథ్యంలో జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించగా.. ఒవైసీ అందుకు నిరాకరించారు.

ఇదీ చదవండి: జడ్ కేటగిరీ భద్రత స్వీకరించండి.. ఒవైసీకి షా విజ్ఞప్తి

Last Updated : Feb 7, 2022, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details