తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలంటీర్​గా కరోనా టీకా తీసుకున్న మంత్రి - వ్యాక్సిన్ తాజా వార్తలు

భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకాను తనపై ప్రయోగించుకున్నారు హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్​ విజ్​. అంబాలా కాంట్​ సివిక్​ ఆస్పత్రిలో టీకా తీసుకున్నారు.

Covaxin
వలంటీర్​గా కరోనా టీకా తీసుకున్న ఆరోగ్యమంత్రి

By

Published : Nov 20, 2020, 1:09 PM IST

హరియాణాలో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 'కొవాగ్జిన్'‌ మూడో దశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం తొలి వలంటీర్‌గా పేరు నమోదు చేయించుకునేందుకు ముందుకు వచ్చిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంబాలాలోని ఆసుపత్రిలో ఆయన టీకా వేయించుకున్నారు.

26 వేల మంది వలంటీర్లు..

దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో చేస్తోన్న ఈ ప్రయోగ పరీక్షల్లో 26 వేల మంది వలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే ఒకటి, రెండు దశల్లో చేపట్టిన ప్రయోగాలు విజయవంతమైనట్లు సంస్థ పేర్కొంది.

భారత వైద్య పరిశోధన మండలిశ(ఐసీఎంఆర్​) సహకారంతో అభివృద్ధి చేస్తున్న ఈ టీకా కోసం దేశంలో భారత్​ బయోటెక్​ చేపడుతోన్న అతిపెద్ద క్లినికల్​ పరీక్ష ఇదే కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details