భాజపాపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీ.. భాజపాతో పొత్తు పెట్టుకుంటోందంటూ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. జేడీఎస్‌కు భాజపా స్నేహం అవసరం లేదని, రాష్ట్రాభివృద్ధి కావాలని స్పష్టం చేశారు. జేడీఎస్‌తో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన కర్ణాటక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీని అంతం చేయాలని భాజపా చూసిందని.. కానీ అది సాధ్యం కాలేదన్నారు కుమారస్వామి. దీంతో జేడీఎస్ తమతో పొత్తుపెట్టుకుంటోందంటూ అసత్య ప్రచారాలు చేస్తోందని భాజపాపై ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
"నాకు కర్ణాటకలోని భాజపా నాయకులకంటే ప్రధాని మోదీతోనే సత్సంబంధాలు ఉన్నాయి. చాలామంది మా పార్టీతో స్నేహంగా ఉండి పార్టీని విడదియ్యాలని చూశారు. ఇప్పుడు అది భాజపా వంతు."