ట్రాన్స్ జెండర్లకు ఆరోగ్య పరంగా, మానసికంగా వెన్నుదన్నుగా ఉండేందుకు కేంద్రం కీలక చర్య చేపట్టనుంది. త్వరలో వారికోసం జాతీయ స్థాయిలో ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రాన్స్ జెండర్లకు త్వరలో ప్రత్యేక హెల్ప్‌లైన్! - ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక హెల్ప్‌లైన్
ట్రాన్స్ జెండర్ల సంరక్షణకు కేంద్రం మరో ముందడుగు వేయనుంది. జాతీయ స్థాయిలో వారికి ఒక హెల్ప్‌లైన్‌ను కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. ట్సాన్స్ జెండర్లకు మానసికంగా, న్యాయబద్ధంగా అండగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు.
ట్రాన్స్ జెండర్లకు త్వరలో ప్రత్యేక హెల్ప్‌లైన్!
కేంద్ర సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ.. కొన్ని సంస్థలతో కలసి హెల్ప్ లైన్ సేవలు అందించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా హిజ్రాలు ఎక్కువగా ఉన్న ఐదు జోన్లలో ఐదుగురు నిపుణులను నియమించి వారి ద్వారా ట్రాన్స్ జెండర్లకు కౌన్సెలింగ్ ఇవ్వనుంది.
ఇదీ చదవండి:కళకు ప్రాణం పోస్తున్న కానిస్టేబుల్